పశ్చిమ గోదావరి రెడ్ క్రాస్ శాఖకు ప్రతిష్టాత్మక అవార్డు

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ శాఖకు మానవతా సేవల రంగంలో విశిష్ట సేవలకు గాను ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా. ఎం. ఎస్. వి. ఎస్. భద్రిరాజు ఈ అవార్డును స్వీకరించారు. రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రదానం చేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్