భీమవరం పట్టణం గాంధీనగర్ సమీపంలోని గిరిజన బాలుర వసతి గృహం మౌలిక వసతుల లేమితో విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తోంది. హాస్టల్‌కు సరైన రోడ్డు మార్గం, వీధిలైట్లు లేకపోవడంతో రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు సైతం వెళ్ళలేని దుస్థితి నెలకొంది. విద్యార్థులు అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.