భీమవరం మండలం రాయలం గ్రామంలో శ్రీవిజయ సాయిబాబా మందిరం 8వ వార్షిక మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు ఆలయాన్ని సందర్శించి, సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం, ఆయన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు గత 8 సంవత్సరాలుగా ఈ వార్షిక మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.