జయప్రకాష్ నాయుడు పుట్టినరోజున సేవా కార్యక్రమాలు

వీరవాసరం జనసేన జెడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా గురువారం పట్టణంలో జేపీ యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ సమాజ సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మావుళ్ళమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి, 28వ వార్డులో 200 మంది పేద మహిళలకు కూరగాయలు, 27వ వార్డులోని పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ప్రేమాలయంలోని వృద్ధులకు భోజనాలు అందించారు.

సంబంధిత పోస్ట్