భీమవరం పోక్సో కోర్టు న్యాయమూర్తి బీ.లక్ష్మీనారాయణ, 8ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15వేల జరిమానా విధించారు. 2021లో కాళ్ల మండలం దొడ్డనపూడి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై కాళ్ల పోలీసు స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. బాధితురాలికి రూ.50,000ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు.