శివనామస్మరణతో మారుమోగిన సోమేశ్వర జనార్ధన స్వామివారి ఆలయం

భీమవరంలోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠ మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రదోషకాల పూజల అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది. అధిక మాసం కావడం వల్ల ఈ మాస శివరాత్రి దర్శనానికి మరింత విశేష ప్రాధాన్యత ఉందని అర్చకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్