భీమవరం పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై బి.వై. కిరణ్ కుమార్ హెచ్చరించారు. 26వ వార్డులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో దాడులు నిర్వహించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 77,660 నగదు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేశారు. పేకాట, కోడిపందాలు, గుండాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై కఠినంగా శిక్షిస్తామని ఎస్సై తెలిపారు.