భీమవరంలో అథ్లెటిక్స్ మాస్టర్ పాకెర్ల సుదర్శనం జ్ఞాపకార్థక కూడిక నిర్వహించారు. 90+ వయసులోనూ షాట్ ఫుట్, జావెలిన్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి, అంతర్జాతీయ స్థాయిలో 115 మెడల్స్ సాధించిన సుదర్శనం మరణం క్రీడాకారులెందరికో తీరని లోటని పలువురు వక్తలు అన్నారు. డా పట్టా దేవరాజ్, ఎస్ దానియేలు పుష్పరాజ్ ఆయనను కఠోర శ్రామికుడిగా, ప్రతి క్రీడలోనూ రాణించగల సత్తా కలిగిన వ్యక్తిగా కొనియాడారు.