జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం మార్చి, ఏప్రిల్ 2026 నెలలకు సంబంధించిన మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. "జన్మనిస్తూ తల్లి మరణించకూడదు, జన్మిస్తూ శిశువు మరణించకూడదు" అనే లక్ష్యంతో అధికారులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మార్చి, ఏప్రిల్ నెలలో జిల్లాలో మాతృ మరణాలు లేవని, నాలుగు శిశు మరణాలు సంభవించినట్లు ఆమె తెలిపారు.