భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఇళ్ల బయట పార్క్ చేసిన వాహనాలు, టేబుల్ ఫ్యాన్లు, ఇతర విలువైన సామగ్రిని అందినకాడికి ఎత్తుకెళ్లారు. ఈ చోరీ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వరుస చోరీలతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.