భీమవరంలో ఆదివారం, టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షులు గోలగాని రమేష్ ఆధ్వర్యంలో 10 మంది పేద, దివ్యాంగులకు 25 కేజీల చొప్పున బియ్యం బస్తాలను అందించారు. ఈ సేవా కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అభినందించారు. పేదవారికి సహాయం చేయడం అత్యంత అభినందనీయమని, టిడిపి కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని ఆమె అన్నారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సహాయం అందించినట్లు గోలగాని రమేష్ తెలిపారు.