వందేమాతరం, మా తెలుగు తల్లికి గీతాల రచయితకు నివాళి

భీమవరం బీవీ రాజు పార్క్ లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో వందేమాతరం గీతం రచయిత బంకించంద్ర ఛటర్జీ, రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి వర్ధంతి కార్యక్రమాలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఈ గీతాలు భారతదేశ ఔన్నత్యానికి ప్రతీకలని, స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం నినాదం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగించిందని తెలిపారు. డా ఎస్ సత్యనారాయణ రాజు, డిఆర్ నాగేశ్వరరావు ఈ గీతాల ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్