స్వయం ఉపాధి రంగాల ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు

జిల్లాలో యువత స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగాల అభివృద్ధి ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ఏహెచ్‌ఐడీఎఫ్ పథకం కింద రూ. 6 కోట్ల వ్యయంతో యువ పారిశ్రామికవేత్త తాడిచెర్ల గణేష్ స్థాపించిన “రైజ్ ఇండియా ఫార్మాస్యూటికల్స్” సంస్థను జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా సందర్శించారు. మరింత మంది యువత వినూత్న ఆలోచనలతో స్వయం ఉపాధి రంగాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్