ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్ లో ర్యాలీ, అవగాహన కార్యక్రమం జరిగింది. యువత మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. జి. గీతా బాయి, డి ఐ ఓ డా. సుధా లక్ష్మి, ఎన్. సి. డి ప్రోగ్రాం ఆఫీసర్ డా. కె. ఎం. ఆర్. కిషోర్, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ గాతల సుభాష్, జి. సాధు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.