జంగారెడ్డిగూడెం సర్కిల్లో 180 మంది బైండోవర్

జంగారెడ్డిగూడెం పోలీసు సర్కిల్ పరిధిలో జూద క్రీడలకు పాల్పడుతున్న 180 మందిని బైండోవర్ చేసినట్లు సీఐ సుభాష్ తెలిపారు. శనివారం వారిని సంబంధిత తహశీల్దార్ కోర్టుల్లో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే సహించేది లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్