చింతలపూడి మండలం ప్రగడవరంలో 99 ఏళ్ల నాటి స్వయంభు శ్రీ శ్రీదేవి అంకమ్మ తల్లి తిరుణాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. 1927లో భూమిలో వెలసిన ఈ స్వయంభు విగ్రహానికి ఐదు రోజులపాటు సాంప్రదాయబద్ధంగా తిరుణాల నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులతో కూచిపూడి నాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.