లింగపాలెంలో బ్రహ్మోత్సవాలు

లింగపాలెం మండలం రంగాపురంలోని శ్రీ భూనీల సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో 62వ బ్రహ్మోత్సవాలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్ సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్