చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడిపించే విధంగా విజన్ 2047 యాక్షన్ ప్లాన్ రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి చింతలపూడిలో ఆయన విజన్ 2047 యాక్షన్ ప్లాన్ పై నాలుగు మండలాల అధికారులతో సమీక్షించారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు సూచిస్తూ శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నారు.