చింతలపూడి గ్రామానికి చెందిన గుంజి వెంకమ్మ గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఈ విషయం వైజాగ్‌కు చెందిన రావెల ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ దృష్టికి చిలకా ఏసుబాబు తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రూ.5000 సహాయాన్ని ఆమె కుమారుడికి అందించారు. అందుకు వారు రావెల ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.