చింతలపూడి: రిషితకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో 9 బంగారు, ఒక వెండి పతకాలు సాధించిన విద్యార్థిని కారుమంచి రిషితను ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మంగళవారం ఘనంగా సత్కరించారు. గవర్నర్ నజీర్ చేతుల మీదుగా పతకాలు అందుకోవడం గర్వకారణమని ఆయన కొనియాడారు. రిషితతో పాటు ఆమె తల్లిదండ్రులు ప్రకాష్, హేమలతలను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్