చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శనివారం క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఆయనను కలుసుకొని వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఇంటి స్థలాలు, సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు వంటి సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే వారి వద్దనుండి అర్జీలు స్వీకరించి వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.