33/11కేవీ చింతలపూడి మండలం రేచర్ల సబ్ స్టేషన్ పరిధిలో గల 11 కేవీ ఎర్రగుంటపల్లి 24 గంటల ఫీడర్, ఎర్రగుంటపల్లి అగ్రికల్చర్ ఫీడర్ల పరిధిలో వర్క్ నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఉదయం 9. 30 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎర్రగుంటపల్లి ఏరియాలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. కావున ఆయా విద్యుత్ వినియోగదారులందరూ గమనించే సహకరించాలని కోరారు.