జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామంలో నూతన బోరు బావి ఏర్పాటుకు కూటమి నాయకులు ఆదివారం శంకుస్థాపన చేశారు. సుమారు 3 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ బోరును ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు తాగునీటిని అందించనున్నట్లు జెడ్పిటిసి సభ్యులు పోల్నాటి బాబ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కుక్కల మాధవరావు, సొసైటీ చైర్మన్ పారేపల్లి మణిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.