ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో TVK పార్టీ అధినేత విజయ్ ఘన విజయం సాధించడం పట్ల వేగవరం గ్రామానికి చెందిన విజయ్ వీర అభిమాని ఇళయ దళపతి వెంకట్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 234 స్థానాల్లో సింగల్ గా పోటీ చేసి ఘనవిజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.