ఏలూరు జిల్లా వైసీపీ భూత్ కమిటీ కన్వీనర్ చింతా అనీల్ కుమార్ గౌడ్ బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, కూటమి పాలన అన్ని రంగాలలో విఫలమవడంతో జగన్ మోహన్ రెడ్డికి ప్రజాదరణ రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు. కూటమి వైఫల్యాల నేపథ్యంలో జగన్ కు ఎనలేని విధంగా మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు.