జంగారెడ్డిగూడెం జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న బాలికను.. ఓ బాలుడు ఏడిపిస్తున్నాడని, విషయం తెలుసుకున్న బాలికకు వరుసకు సోదరుడైన చిన్నా బుధవారం పాఠశాలకు వెళ్లి సదరు బాలుడిపై దాడి చేశాడు. దీంతో ఉపాధ్యాయులు వెంటనే అతన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జబీర్ పాఠశాలకు వెళ్లి వివరాలు తెలుసుకుని, చిన్నాను మందలించారు. అంనతరం హెచ్ఎం సోమశేఖర్ బాలుడు, బాలిక పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.