జంగారెడ్డిగూడెం: ముగిసిన జిల్లా స్థాయి అండర్ -15 చెస్ పోటీలు

జంగారెడ్డిగూడెంలోని ఓ చెస్ అకాడమీ నిర్వహించిన జిల్లా అండర్-15 ఓపెన్ & బాలికల చెస్ ఛాంపియన్‌షిప్ ఎంపికల పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో 4 రౌండ్లు, బాలికల విభాగంలో 3 రౌండ్లు నిర్వహించారు. బాలుర విభాగంలో అవ్రహం మొదటి స్థానం, అక్షిత్ రెండో స్థానం, సూర్యశ్రీ ప్రద్యుమ్న మూడో స్థానం, జ్యోతి స్వరూప్ నాలుగో స్థానం సాధించారు. బాలికల విభాగంలో బాబ్లీ బాల మొదటి స్థానం, సుచిత్ర క్రిష్టి రెండో స్థానం కైవసం చేసుకున్నారు. ఈ పోటీలు చెస్ క్రీడలో యువత ప్రతిభను వెలికితీశాయి.

సంబంధిత పోస్ట్