జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి గుడి సమీపంలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6,370 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై తదుపరి చర్యల కోసం నిందితులను లక్కవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.