జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న దుర్ఘటనలో స్టాలిన్ అనే వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్టాలిన్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.