జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం సబ్ స్టేషన్ పరిధిలో నిమ్మలగూడెం గ్రామానికి కరెంట్ లైన్ వేయడానికి 12న కరెంటు నిలుపుదల చేస్తున్నట్లు ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కట్టపాదులగూడెం గ్రామంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.