ఏలూరు జిల్లా రీజినల్ విజిలెన్స్ అధికారి కె. నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మంగళవారం జంగారెడ్డి మండలంలోని దేవులపల్లి, ఉప్పలమెట్టలో రేషన్ షాపులపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బియ్యం, పంచదార నిల్వల్లో భారీ వ్యత్యాసాలు గుర్తించారు. రూ. 8, 41, 541 విలువైన సరకును అధికారులు సీజ్ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత డీలర్‌పై నిత్యావసర వస్తువుల చట్టం కింద 6(A) కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.