కామవరపుకోట పంచాయతీ బోర్డు సమావేశం శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగింది. సర్పంచ్ కర్రిపోతు అనూష భాగ్యరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పంచాయతీలో ట్యాంక్ ఆపరేటర్ల జీతాలు పెంచాలని సర్పంచ్, ఉప సర్పంచ్ తీర్మానం ప్రతిపాదించారు. దీనిపై సోమవారం సమావేశంలో తుదినిర్ణయం తీసుకుంటామని తెలిపారు.