కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లి గ్రామంలో బుధవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మరీదు దుర్గారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 10 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు. చట్ట విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తే, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని ఎక్సైజ్ సీఐ అన్నారు.