కామవరపుకోట మండలంలో మంగళవారం ప్రైవేట్ పాఠశాలల వాహనాలపై రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయ అధికారులు కె.డి.వి. రవి గోపాల్, చి. సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో స్కూల్ బస్సులు, వానులు, ఆటోలపై తీవ్రంగా తనిఖీలు నిర్వహించి, విద్యార్థుల భద్రతపై దృష్టి సారించారు.