కామవరపుకోట: అక్రమ మద్యం కలిగిన వ్యక్తి అరెస్ట్

కామవరపుకోటలో అక్రమ మద్యం కలిగి ఉన్న గుల్లా శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 33 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపారు. అక్రమ మద్యం విక్రయించడం, కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాల గురించి ప్రజలు సమాచారం అందించాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్