కామవరపుకోట మండలం గొల్లగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం సెలవు దినం కావడంతో, కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నేరుగా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కిలార సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.