శనివారం, కార్తీకమాసాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తులు స్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ చేసి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించారు.