లింగపాలెం మండల బీసీ నాయకులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం మండలంలోని 22 గ్రామపంచాయతీలకు గాను 10 గ్రామ పార్టీ అధ్యక్షులు బీసీలకు ఇవ్వాలని కోరారు. అలాగే మండల పార్టీ అధ్యక్షులు బీసీలకు ఇవ్వాలని ఎమ్మెల్యేని కోరడం జరిగింది. ఈ అంశంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి బీసీలకు తన వంతు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.