లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామానికి చెందిన బాల వెంకటేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం సీఎం సహాయనిధి నుండి మంజూరైన రూ. 1,01,000 చెక్కును అందజేసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.