లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో గురువారం అనధికారికంగా తరలిస్తున్న ఎరువుల బస్తాలను చింతలపూడి అగ్రికల్చర్ ఏడి సుబ్బారావు, లింగపాలెం మండలం అగ్రికల్చర్ ఏవో ప్రదీప్ కుమార్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను ప్రశ్నించగా మైలవరం నుండి చింతలపూడికి తరలిస్తున్నట్లు తెలిపాడని, ఏడి సుబ్బారావు పేర్కొన్నారు. ఈ క్రమంలో వాహనాన్ని, ఎరువులను సీజ్ చేశామన్నారు.