ద్వారకాతిరుమల వద్ద లారీ బోల్తా

తమిళనాడు నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న ఐరన్ స్క్రాప్ లారీ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి వద్ద బుధవారం బోల్తా పడింది. రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ బోల్తా పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్