జంగారెడ్డిగూడెం వద్ద మేడే సందర్భంగా యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు యం. వి. శ్యాంబాబు యూటీఎఫ్ పతకాన్నిశుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార, వస్తు ఉత్పత్తిలో శ్రామికుల పాత్ర కీలకమని, సమాజ అభివృద్ధిలో కార్మికులే ప్రధాన పాత్రధారులని అన్నారు. వారి హక్కులు, అవసరాల కోసం ఆలోచించి, వాటిని కల్పించాల్సిన అవసరాన్ని గుర్తుచేసే రోజు మేడే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ శ్రీ ఎంఎ నభి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీ టి రామకృష్ణ, ముషబర్, నాయకులు యేసురత్నం,ప్రసాద్, సోమేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.