చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో శుక్రవారం ఎన్‌టీఆర్ భరోసా స్పౌజ్ పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. నూతన పింఛన్లను లబ్దిదారుల ఇంటికి వెళ్లి ఆయన స్వయంగా అందజేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కూటమి నాయకులు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.