డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

చింతలపూడి వైస్సార్ కాలనీలో డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడడంతో ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించబడుతుందని తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్