జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ మరమ్మతులు కారణంగా ముదినేపల్లి 11 కేవీ ఫీడర్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ ఏఈ పూర్ణచంద్రరావు గురువారం తెలిపారు. మండల కేంద్రం ముదినేపల్లి పరిధిలోని గృహ, వాణిజ్య, ఆక్వా వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని కోరారు.