చింతలపూడి 132/33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని శంఖుచక్రపురం, టీ. నరసాపురం, రాఘవపురం, శెట్టివారిగూడెం ఫీడర్లకు ట్రీ కటింగ్, లైన్ మరమ్మతుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ అంబేద్కర్ తెలిపారు. ఉదయం 8. 30 గంటల నుంచి మధ్యాహ్నం 2. 30 వరకు సరఫరా నిలిచిపోతుందన్నారు. కావున ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని విద్యుత్ వినియోగదారులందరూ సహకరించాలని కోరారు.