రోషన్ కుమార్ చేతుల మీదుగా ₹25,000 చెక్కు అందజేత

కామవరపుకోట మండలం, అంకాలంపాడు పంచాయతీ, జలపవారిగూడెం గ్రామానికి చెందిన ఉప్పెరామారావు ప్రమాదంలో గాయపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న కామవరపుకోట మండల మాజీ అధ్యక్షులు ఏలూరు హరి రామకృష్ణ, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సహకారంతో CMRF ద్వారా ₹25,000 విలువైన చెక్కును ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. "నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు పేదవానికి సేవ చేస్తూనే ఉంటా" అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్