నూతన సంవత్సరం సందర్భంగా గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమాన్ చాలీసా పారాయణాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.