ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో మంగళవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారి, చల్లబడి బలమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీనితో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఉదయం నుండి ఎండ వేడిమితో ఇబ్బంది పడిన ప్రజలు వర్షం రాకతో ఉపశమనం పొందారు.