జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం సినీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హంగామా చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందించిన 'కింగ్డమ్' చిత్రం విడుదల సందర్భంగా పట్టణంలోని ఓ థియేటర్ వద్ద అభిమానులు భారీగా ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అనంతరం విజయ్ దేవరకొండ కటౌట్ కి పాలాభిషేకం చేసి తీన్మార్ డబ్బులు వాయిస్తూ చిందులు వేశారు.